తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'వార్దా' ప్రసంగానికి ఈసీ క్లీన్​చిట్ - రాహుల్​ గాంధీ

కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పోటీ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ వార్దాలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. ఈ ప్రసంగానికి కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్​చిట్​ ఇచ్చింది. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రావని ఈసీ స్పష్టం చేసింది.

మోదీ 'వార్దా' ప్రసంగానికి ఈసీ క్లీన్​చిట్

By

Published : May 1, 2019, 6:30 AM IST

మోదీ 'వార్దా' ప్రసంగానికి ఈసీ క్లీన్​చిట్

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై మహారాష్ట్రలోని వార్దాలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్ ఇచ్చింది.

ఏప్రిల్ 1న మహారాష్ట్రలోని వార్దాలో ప్రచారంలో పాల్గొన్న మోదీ హిందూ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఆరోపించారు. అందుకే మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉండే కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తున్నారని విమర్శించారు.

మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం మోదీ ప్రసంగం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details