దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన 56 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి నవంబరు 3, 7 తేదీల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. 54 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 3న ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపింది ఈసీ. బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి, మణిపూర్‌లోని రెండు శాసనసభ స్థానాలకు నవంబరు 7న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉప ఎన్నికల ఫలితాలను నవంబరు 10న ప్రకటించనున్నట్లు తెలిపింది.
56 శాసనసభ స్థానాలకు నవంబరులో ఉపఎన్నికలు - ఉప ఎన్నికల న్యూస్
దేశంలో ఖాళీ అయిన 56 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికల తేది ఖరారైంది. నవంబరు 3,7 తేదిల్లో ఈ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
56 శాసనసభ స్థానాలకు నవంబరులో ఎన్నికలు
మరోవైపు కేరళ, తమిళనాడు, అసోం, బంగాల్‌లలో ఉన్న 7 శాసనసభ స్థానాలకు ఈ పరిస్థితులలో ఉపఎన్నికలు నిర్వహించరాదని ఆయా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి:'అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఆయనే!'