కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెరాస, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్... ఇలా జాతీయం నుంచి ప్రాంతీయం వరకు దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. 'మన దేశంలో మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయి?' ఈ ప్రశ్న మీకు ఎప్పుడోసారి వచ్చే ఉంటుంది? మీ సందేహానికి ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాలే సమాధానం.
దేశంలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 2వేల 293. ఈ విషయాన్ని వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 9వ తేదీలోపు నమోదైన వివరాలను ప్రకటించింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా 149 పార్టీలు కొత్తగా పేర్లను ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్నాయి. ఫిబ్రవరి ముందు వరకు పార్టీల సంఖ్య 2వేల143. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు 58 కొత్త పార్టీలు నమోదు చేసుకున్నాయి.