తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువభారత్​ రక్షణ కోసమే ఈ-సిగరెట్లపై నిషేధం' - ప్రధాన మంత్రి

దేశ యువత రక్షణ కోసమే ఈ-సిగరెట్లను నిషేధించామన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భారతావని నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

'యువభారత్​ రక్షణ కోసమే ఈ-సిగరెట్లపై నిషేధం'

By

Published : Sep 29, 2019, 1:41 PM IST

Updated : Oct 2, 2019, 10:59 AM IST

'యువభారత్​ రక్షణ కోసమే ఈ-సిగరెట్లపై నిషేధం'

యువతను మత్తుకు దూరంగా ఉంచి.. ఆరోగ్యకర భారతావనిని నిర్మించేందుకే ఈ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ధూమపానాన్ని దూరం చేసేందుకు దేశ ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ-సిగరెట్లపై తక్కువ అవగాహన ఉన్నందున ప్రజలకు వాటివల్ల కలిగే అనర్ధాల గురించి తెలియడం లేదని మన్​-కీ-బాత్ ప్రసంగంలో వివరించారు ప్రధాని. ఈ-సిగరెట్ల తయారీలో హానికర రసాయనాలను వినియోగిస్తున్నా.. నేటితరం యువత వాటిని ఫ్యాషన్​ కోసం కాల్చుతున్నారన్నారు మోదీ.

"భారత ప్రభుత్వం ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన సంగతి మీకందరికీ తెలుసు. ఎలక్ట్రానిక్​ పరికరాలతో తయారైన ఈ-సిగరెట్లు.. సాధారణ సిగరెట్లకు భిన్నంగా ఉంటాయి. సాధారణ సిగరెట్లలో వచ్చే పొగ, దుర్వాసన వీటిలో రాకుండా ఉండేందుకు కొన్ని సుగంధ ద్రవ్యాలను వీటి తయారీలో వినియోగిస్తారు. ఈ-సిగరెట్లలో నికోటిన్​ను కలిగిన ద్రవపదార్థాన్ని వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పొగ.. రసాయనాలతో నిండి ఉంటుంది. తద్వారా వినియోగదారులు నికోటిన్​ను తీసుకుంటున్నట్లు అవుతోంది. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

పొగాకు వినియోగంపైనా ప్రసంగించారు మోదీ. పొగాకుకు బానిసగా మారడం ఎంతో హానికరమని ప్రజలను హెచ్చరించారు.

"పొగాకును వినియోగిస్తున్నవారికి క్యాన్సర్​, డయోబెటిస్​, రక్తపోటు వంటి వ్యాధులు సోకేందుకు ఎక్కువ అవకాశముంది. పొగాకులో నికోటిన్​ ఉండటం వల్ల అది మనకు హాని చేస్తుంది. కౌమారదశలో బుద్ధి ఎదుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Last Updated : Oct 2, 2019, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details