తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జేడీయూకు ఓటేయొద్దు.. భాజపా-ఎల్​జేపీదే గెలుపు' - ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ జేడీయూతో విభేదాల కారణంగా ఎన్డీఏ నుంచి వైదొలిగిన లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ).. నితీశ్​ పార్టీకి ఓటు వేయొద్దంటూ ప్రజలకు అభ్యర్థించింది.

Don't vote for JD(U), BJP-LJP will form next govt in Bihar: Chirag Paswan
జేడీ(యూ)కు ఓటేయొద్దు.. భాజపా-ఎల్​జేపీలదే అధికారం

By

Published : Oct 5, 2020, 6:42 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి మరింత రాజుకుంది. నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు ఓటెయొద్దని రాష్ట్ర ప్రజలను కోరారు లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​. ఇటీవలే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ)ని వీడిన చిరాగ్​.. నితీశ్​​ను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం భాజపా-ఎల్​జేపీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని ధీమా వ్యక్తం చేశారు పాసవాన్​.

"బిహార్​ చరిత్రలో ఇది అత్యంత కీలక పరిణామం. ఈ ఎన్నికలతో రాష్ట్రంలోని 12కోట్ల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఈ తరుణంలో ఎల్​జేపీ ముందుకెళ్లడం అంత తేలికైన పనికాదు. అయినప్పటికీ మేం పోరాడతాం. గెలిచి తీరతాం."

- చిరాగ్​ పాసవాన్​, లోక్ జన్​శక్తి పార్టీ అధ్యక్షుడు

ఎన్డీఏలో కుమార్​ నాయకత్వాన్ని అంగీకరించమన్న ఎల్​జేపీ.. ఆయన కారణంగానే ఇటీవలే కూటమి నుంచి వైదొలిగింది. అయితే.. ఎన్నికల అనంతరం ఎల్​జేపీ ఎమ్మెల్యేలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు పాసవాన్​.

ఇదీ చదవండి:'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ'.

ABOUT THE AUTHOR

...view details