దేశ వ్యాప్తంగా హిందీ ఉమ్మడి భాషగా ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ నటుడు రజనీకాంత్. హిందీ భాషను బలవంతంగా రుద్దడం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా, పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సమ్మతం కాదన్నారు.
హిందీని బలవంతంగా రుద్దొద్దు: రజనీ
దేశంలో ఉమ్మడి భాష విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదన్నారు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'ఉమ్మడి భాష అసాధ్యం..హిందీని బలవంతంగా రుద్దొద్దు'
ఏ దేశానికైనా ఉమ్మడి భాష ఉండడం ఆ దేశ ఐక్యతకు, అభివృద్ధికి మంచిదని తెలిపిన రజనీ... మన దేశంలో మాత్రం ఒక ఉమ్మడి భాషను తీసుకురావడం అసాధ్యమని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దితే తమిళనాడే కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాలు,పలు ఉత్తర భారత రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తాయన్నారు.
ఇదీ చూడండి: కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ
Last Updated : Oct 1, 2019, 1:58 AM IST