తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శునకా'నందాన్ని పొందిన యువకులు.! - Aurangabad Virol news

శునకం అంటే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు చాలామంది. మరికొందరైతే తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. దానికి సకల సౌకర్యాలు కల్పిస్తుంటారు. కానీ.. మహారాష్ట్రలో కొందరు ఓ శునకాన్ని చిత్రహింసలు పెట్టారు. తమ సరదా కోసం.. కుక్కను బైక్​కు కట్టేసి కిలోమీటర్​ పాటు ఈడ్చుకెళ్లారు.

Dog dragged for 1 kilometwer in Aurngabad by two man FIR  registered
శునకానందాన్ని పొందిన యువకులు.!

By

Published : Jun 7, 2020, 1:27 PM IST

మహారాష్ట్రలో అమానవీయ ఘటన జరిగింది. ఔరంగాబాద్‌లో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు శునకం మెడకు చైన్‌ కట్టి దానిని సుమారు కిలోమీటర్‌ వరకూ లాక్కెళ్లారు. శునకం వదిలించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ద్విచక్రవాహనం వెనక వచ్చిన వారు ఈ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

'శునకా'నందాన్ని పొందిన యువకులు.!

సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి కొందరు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకాన్ని లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఇంట్లో దూరిన ఎగిరేపాము.. పట్టుకోలేక ఆపసోపాలు!

ABOUT THE AUTHOR

...view details