తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాముతో పోరాడి మరణించిన 4 శునకాలు

శునకం.. విశ్వాసానికి మారుపేరు అని అంటుంటారు. ఇంటికి రక్షణగా ఉండటమే వీటి పని. యజమానులు పెట్టింది తింటూ కాపలా కాస్తుంటాయి. కానీ.. బిహార్​ భగల్​పుర్​లో తమ బాధ్యతకు మించి యజమానుల కుటుంబాన్ని రక్షించబోయి నాలుగు కుక్కలు ప్రాణాలర్పించాయి.

By

Published : Apr 19, 2019, 7:02 AM IST

పాముతో పోరాడి మరణించిన 4 శునకాలు

యజమాని కోసం ప్రాణాలర్పించిన శునకాలు

బిహార్​లోని భగల్​పుర్​లో నాలుగు శునకాలు యజమాని కుటుంబం కోసం ప్రాణాలర్పించాయి. స్థానిక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్​ పూనమ్ 3 సంవత్సరాల నుంచి​ ఈ శునకాల్ని పెంచుకుంటున్నారు. రెక్స్​.. దాని పిల్లలు బ్లాకీ, క్యూటీ, బింగో రాత్రిపూట ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన విషపూరిత సర్పాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించాయి. బుసలు కొడుతున్న పామును ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చాలా సేపు అడ్డుకున్నాయి. చివరకు పాము విషం కారణంగా 4 శునకాలు మరణించాయి. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

4 శునకాలను కుటుంబసభ్యుల్లా భావించేవారు పూనమ్​. ఇప్పుడు వాటి మృతితో తీరని విషాదంలో మునిగిపోయారు. కుక్కల మృతదేహాలను తమ నివాస ప్రాంగణంలోనే ఖననం చేశారు.

ఇదీ చూడండి:రిలయన్స్​ ఇండస్ట్రీస్​, జియోలకు​ రికార్డు లాభాలు...

ABOUT THE AUTHOR

...view details