వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వృద్ధురాలు రెండుసార్లు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది...
హరియాణాలోని భివానీకి చెందిన భతేరి దేవి అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారి కిందపడగా... కాలు విరిగింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు భన్సీలాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె ఎడమ కాలికి శస్త్రచికిత్స చేశారు. అయితే విరిగింది 'కుడి కాలు'కాగా.. ఎడమ కాలికి ఆపరేషన్ చేశారేంటని కుటుంబ సభ్యులు అడగ్గా... మరోసారి శస్త్రచికిత్స చేశారు. అయితే.. రెండోసారి ఆపరేషన్ సమయంలో తమకు ఎలాంటి బిల్లు వేయలేదని దేవి బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని.. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.