తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక రోగంతో ఆసుపత్రికి వస్తే మరో వ్యాధికి శస్త్రచికిత్స! - Gaya

బిహార్​లో హైడ్రోసీల్​ చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి అనుకోని పరిస్థితి ఎదురైంది. అసలు సమస్యను వదిలిపెట్టి... కుడికాలికి శస్త్రచికిత్స చేశాడు వైద్యుడు.

ఒక రోగంతో ఆసుపత్రికి వస్తే మరో వ్యాధికి శస్త్రచికిత్స!

By

Published : Sep 5, 2019, 1:04 PM IST

Updated : Sep 29, 2019, 12:43 PM IST

బిహార్​ గయా నగరంలోని 'అనుగ్ర నారాయణ్​ మగధ్​ వైద్య కళాశాల​'(ఏఎన్​ఎమ్​ఎమ్​సీహెచ్​)లో అనూహ్య ఘటన జరిగింది. శస్త్రచికిత్స కోసం వచ్చిన రోగిని కంగు తినిపించాడు ఓ వైద్యుడు​. రోగి ఒక వ్యాధితో ఆసుపత్రి గడప తొక్కగా మరో రోగానికి శస్త్రచికిత్స చేశాడు.

ఇదీ జరిగింది

గయా జిల్లాలోని పునకాల గ్రామానికి చెందిన భునేశ్వర్​ యాదవ్​ బుధవారం వరిబీజం(హైడ్రోసీల్​) సమస్యతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి తన సమస్య వివరించాడు. కానీ... ఆ డాక్టర్​ హైడ్రోసీల్​కు బదులు రోగి కుడి కాలుకు శస్త్రచికిత్స చేశాడు. కాలులో ఒక ఇనుప కడ్డీని సైతం అమర్చాడు. అసలు విషయం తెలుసుకుని రోగి కంగుతిన్నాడు.

ఏఎన్​ఎమ్​ఎమ్​సీహెచ్​ సూపరింటెండెంట్​ విజయ్ కృష్ణప్రసాద్​ వైద్యునికి బాసటగా నిలిచారు. భునేశ్వర్​ కాలు ఉబ్బినందుకే శస్త్రచికిత్స నిర్వహించి ఉంటారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : గూగుల్​కు 170 మిలియన్​ డాలర్ల భారీ జరిమానా

Last Updated : Sep 29, 2019, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details