తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి

సార్వత్రిక సమరంతోపాటు శాసనసభ ఎన్నికలు జరిగేది 4 రాష్ట్రాల్లోనే. అయినా... ఈ ఎన్నికలతోనే తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగే అవకాశముంది. ఇందుకు కారణం... 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలే. పళనిస్వామి ప్రభుత్వ భవిష్యత్... ఈ ఫలితంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడేం జరుగుతుంది? ఒకేసారి దిల్లీ, చెన్నైలో చక్రం తిప్పాలన్న డీఎంకే కల నెరవేరుతుందా?

తమిళనాడులో పాగా వేసేది ఎవరు?

By

Published : Mar 31, 2019, 7:01 PM IST

తమిళనాడులో పాగా వేసేది ఎవరు?
2011 శాసనసభ ఎన్నికల్లో పరాజయం. 2014 లోక్​సభ ఎన్నికల్లో మరీ ఘోరం. కనీసం ఖాతా అయినా తెరవని దుస్థితి డీఎంకేది. తర్వాత అనేక మలుపులు. అగ్రనేతలు జయలలిత, కరుణానిధి మరణాంతరం తమిళ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఇలాంటి సమయంలో తిరిగి పుంజుకునేందుకు స్టాలిన్​ సేనకు ఒకేసారి 2 అవకాశాలు వచ్చాయి.

ఇవీచూడండి:

గడ్కరీ వ్యక్తిత్వం X భాజపాపై వ్యతిరేకత!

భారత్​ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా

తమిళనాడులోని 39 లోక్​సభ నియోజకవర్గాలకు ఏప్రిల్​ 18న ఎన్నికలు. వాటితో పాటు అదే రోజున 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు. లోక్​సభ ఎన్నికలు... దిల్లీలో చక్రం తిప్పేందుకు వచ్చిన అవకాశం. శాసనసభ ఉపఎన్నికలు... చెన్నై పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న మార్గం.

హస్తినలో పునర్​ వైభవం కోసం...

కరుణానిధి నేతృత్వంలో ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది డీఎంకే. 1989లో ఈ పార్టీ తొలిసారి కేంద్రంలో నేషనల్​ ఫ్రంట్​ ప్రభుత్వంలో కేబినెట్​ బెర్తు సొంతం చేసుకుంది. అనంతరం 1996 యునైటెడ్​ ఫ్రంట్​ ప్రభుత్వంలోనూ అదే పాత్ర పోషించింది. వాజ్​పేయూ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో.. మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వంలోని యూపీఏ హయాంలోనూ డీఎంకే కేబినెట్​లో ఒక భాగంగా ఉంది.

తమిళుల రక్షకుడు....

తమిళుల ప్రయోజనాలు ముఖ్యమన్నదే డీఎంకే విధానం. అందుకే 2009లో ఎల్టీటీఈపై దాడి చేస్తున్న శ్రీలంక సైన్యానికి వ్యతిరేకంగా కరుణానిధి 6 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు కరుణానిధి. వెంటనే... యూపీఏ ప్రభుత్వం శ్రీలంకపై ఒత్తిడి తెచ్చి దాడులు తాత్కాలికంగా ఆగేలా చేసింది. ఇదంతా తమ విజయమేనని ప్రచారం చేసుకుంది డీఎంకే.

అనూహ్యంగా... 2009 లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే... మే 17, 18 తేదీల్లో శ్రీలంక సైన్యం విజృంభించింది. ఎల్​టీటీఈపై విరుచుకుపడింది. నరమేధం తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా.. కరుణానిధి తమిళుల రక్షకుడు అనే ముద్రను పోగొట్టుకున్నారు. 2జీ కుంభకోణంలో ఆరోపణలతో 2011 అసెంబ్లీ, 2014 లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.

2019 ఎన్నికలకు ముందు మరోమారు తమిళ నినాదాన్ని నమ్ముకుంది డీఎంకే. కావేరి జలవివాదం, హిందీ భాష బలవంతంగా రుద్దడం, నీట్​ వంటి అంశాలు ప్రస్తావిస్తూ... కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను తమిళ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేస్తోంది. జాతీయస్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్​తో జట్టుకట్టింది. తమిళనాడులో 9 సీట్లు, పుదుచ్చేరి లోక్​సభ స్థానాన్ని మిత్రపక్షానికి కేటాయించింది.

తమిళనాడులో డీఎంకే 20 లోక్​సభ స్థానాల్లోనే బరిలోకి దిగింది. పార్టీ బలంగా ఉన్న చోటే పోటీ చేస్తూ విజయావకాశాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

లక్ష్యం 13...

లోక్​సభ ఎన్నికలు ప్రధానమైనా... డీఎంకే దృష్టంతా ఉపఎన్నికలపైనే. అన్నాడీఎంకేలో నాటకీయ పరిణామాలతో 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. డీఎంకే సభ్యుడి మృతితో తిరువారూర్​ స్థానం ఖాళీ అయింది. దశాబ్దాల నాటి ఓ కేసులో శిక్షతో... హోసూర్​ నుంచి గెలిచిన మంత్రి బాలకృష్ణారెడ్డి శాసనసభ సభ్యత్వం కోల్పోయారు. ఇప్పుడు ఈ 18 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 235. ప్రస్తుతం 22 ఖాళీలున్నాయి. మిగిలినవాటిలో అన్నాడీఎంకే బలం 113. డీఎంకేకు 88, కాంగ్రెస్​కు​ 8మంది సభ్యులు ఉన్నారు. మిగిలినవి చిన్నపార్టీల సభ్యులు, ఇతరులు. ఇప్పుడు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కనీసం 13 స్థానాలు గెలవాలన్నది డీఎంకే లక్ష్యం. అప్పుడు కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. ఇలా దిల్లీ, చెన్నైలో ఒకేసారి సత్తా చాటే లక్ష్యంతో స్టాలిన్ సేన అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: రాజకీయ తెరపై తారాతోరణం

పక్కా లెక్కలతో సం'కుల' సమరానికి సై

ABOUT THE AUTHOR

...view details