తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నిర్భయ దోషి మైనర్​ కాదు: దిల్లీ హైకోర్టు

నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్​ అంటూ దోషి పవన్​ కుమార్​ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అతడి న్యాయవాదికి రూ.25వేలు జరిమానా విధించింది.

దిల్లీ హైకోర్టు
దిల్లీ హైకోర్టు

By

Published : Dec 19, 2019, 5:05 PM IST

నిర్భయ కేసులో దోషి పవన్​ కుమార్ గుప్తా​ పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఘటన సమయం(డిసెంబర్​ 2012)లో తాను మైనర్​ అని, బాల నేరస్థుల​ చట్టం కింద తనను శిక్షించాలని అతడు కోర్టును కోరాడు.

వ్యాజ్యం కొట్టివేతతో పాటు గుప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్​కు రూ.25వేలు జరిమానా విధించింది కోర్టు. న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయకుండా కోర్టుకు గైర్హాజరయ్యాని ఆగ్రహించింది. దోషి వయసుకు సంబంధించి తప్పుడు ప్రమాణ పత్రం సమర్పించినందుకు సింగ్​పై చర్యలు తీసుకోవాలని బార్​ కౌన్సిల్​ను ఆదేశించింది.

నిర్భయ తల్లి హర్షం

హైకోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి సంతోషం వ్యక్తం చేశారు.

"ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పడం ఎంతో అవసరం. చాలా సంతోషంగా ఉంది. "

-ఆశా దేవి, నిర్భయ తల్లి

ఇదీ జరిగింది..

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్​ 29న తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, అక్షయ్​, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది.

ఇదీ చూడండి: అవగాహన లేక 'పౌర' చట్టంపై విపక్షాల నిరసనలు

ABOUT THE AUTHOR

...view details