తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసీ షోకాజ్​ నోటీసులపై రాహుల్ స్పందన - EC

ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ స్పందించారు. తాను ఎన్నికల నియమావళిని మీరలేదని తెలిపారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఫిర్యాదులు కొట్టేయాలని కోరారు.

షోకాజ్​ నోటీసులపై రాహుల్​ స్పందన

By

Published : May 11, 2019, 6:19 AM IST

Updated : May 11, 2019, 8:00 AM IST

షోకాజ్​ నోటీసులపై రాహుల్​ స్పందన

ఎన్నికల సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్పందించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. తన ప్రసంగంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని.. మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు చేశానని బదులిచ్చారు. మోదీపై తాను చేసిన ఆరోపణలు నిరాధారమైనవేమీ కాదన్నారు రాహుల్. భాజపా ప్రభుత్వం అనుసరిస్తోన్న దళిత వ్యతిరేక విధానాలపైనే వ్యాఖ్యానించినట్లు రాహుల్​ స్పష్టం చేశారు. తనపై ఉన్న ఫిర్యాదులను కొట్టేయాలని అధికారులను కోరారు​. తన స్పందనతో పాటు ఈ విషయానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను ఈసీకి అందజేశారు రాహుల్​.

ఈసీ వివక్ష లేకుండా పనిచేయాలి

ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదుల విషయంలో దేశ రాజకీయ నాయకులందరిపైనా ఎలాంటి వివక్ష చూపకుండా ఎన్నికల సంఘం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు రాహుల్​.

రాహుల్​ వ్యాఖ్యలు

ఏప్రిల్​ 23న మధ్యప్రదేశ్​ షాదోల్​ లోక్​సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్​ పాల్గొన్నారు. 'మోదీ ప్రభుత్వం గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని వ్యాఖ్యానించారు. రాహుల్​ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని భాజపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఈనెల 1న రాహుల్​కు ఈసీ షోకాజ్​నోటీసులు జారీచేసింది. ఈ విషయంపై స్పందనకు గడువు పెంచాలని ఇప్పటికే రెండుసార్లు కోరిన రాహుల్​ ఎట్టకేలకు శుక్రవారం స్పందించారు.

ఇదీ చూడండి : 'అబ్బే... గంభీర్​ అలాంటి వ్యక్తి కాదే...'

Last Updated : May 11, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details