తెలంగాణ

telangana

లాక్​డౌన్​ ఉల్లంఘించారని ఐపీఎస్ అధికారిపై వేటు

By

Published : Apr 10, 2020, 11:02 AM IST

Updated : Apr 10, 2020, 11:41 AM IST

లాక్​డౌన్​ ఉల్లంఘన ఆరోపణలతో ఓ సీనియర్​ ఐపీఎస్​ అధికారిపై చర్యలకు సిద్ధమైంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎస్​ బ్యాంక్ కేసులో నిందితులైన డీఎహెచ్​ఎఫ్​ఎల్​ ప్రమోటర్లకు లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలకు అనుతించినందుకు ఆ అధికారిని తప్పనిసరి సెలవులపై పంపింది.

kapil wadwan
కపిల్​ వాద్వాన్

లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఓ సీనియర్ ఐపీఎస్​ అధికారిని తప్పనిసరి సెలవులపై పంపింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎస్​ బ్యాంక్ కేసులో నిందితులుగా ఉన్న డీహెచ్​ఎఫ్​ఎల్​ ప్రమోటర్​లు కపిల్​, ధీరజ్ వాద్వాన్​లకు ప్రస్తుత లాక్​డౌన్​ సమయంలో ప్రయాణాలకు అనుమతిచ్చినందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ స్పష్టం చేశారు.

"ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో చర్చించిన తర్వాతే సీనియర్ ఐపీఎస్​ అధికారి అమితాబ్​ గుప్తాను తప్పనిసరి సెలవుపై పంపించాం. తక్షణమే ఇది అమలులోకి వస్తుంది. ఆయనపై విచారణ పెండింగ్​లో ఉంది." -అనిల్​ దేశ్​ముఖ్, మహారాష్ట్ర హోం మంత్రి

లాక్​డౌన్​ ఉన్నా ఫామ్​హౌస్​కు..

అమితాబ్​ గుప్తా అనుమతితో కపిల్​, ధీరజ్ వాద్వాన్ సతారా జిల్లా మహాబలేశ్వర్​లోని వారి ఫామ్​హౌజ్​కు చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ మొత్తం 23 మంది ఉన్నట్లు వెల్లడించారు. వారిలో కొంత మంది ఖండాల నుంచి పుణె, సతారా జిల్లాలను దాటుకుని ప్రయాణాలకు అనుమతిలేకున్నా అక్కడకు వచ్చినట్లు వివరించారు. లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘన కింద వారందరిపై సతారా పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, ప్రస్తుతం నిర్బంధంలో ఉంచినట్లు స్పష్టం చేశారు.

దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు..

లాక్​డౌన్​ ఉల్లంఘనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "మహారాష్ట్రలో ధనవంతులకు లాక్​డౌన్ వర్తించదా? ఇలాంటి సమయాల్లో అధికారులు ప్రయాణాలకు ఎలా అనుమతించారు" అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:భవితను మనమే నిర్మించుకుందాం!

Last Updated : Apr 10, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details