మహారాష్ట్రలో అష్టా గ్రామంలో మూఢ నమ్మకాన్ని తొలగించేందుకు.. ఆ ఊరి లింగాయత్ సంఘం ముందుకొచ్చింది. మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించింది. వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొనగా.. వారిలో దెయ్యాలు ఉన్నాయన్న మూఢనమ్మకాన్ని తొలగించారు.
ఓ వ్యక్తి చొరవతో...
అష్టా గ్రామంలోని శ్మశాన వాటికలో దెయ్యాలు తిరుగుతున్నాయని గ్రామస్థులు నమ్మేవారు. ఆ అపోహను తొలగించేందుకు ప్రకాశ్ మహాజన్ అనే వ్యక్తి చొరవచూపారు. ఆయనతోపాటు లింగాయత్ సంఘం ముందుకు వచ్చి దెయ్యాలు లేవని నిరూపించాలని నిర్ణయించారు. శ్మశానంలో ఉత్సవాన్ని నిర్వహించారు. గ్రామస్థులను అక్కడికి వచ్చేలా చేశారు. మూడురోజుల పాటు వేడుకలను నిర్వహించి వారిలో ఉన్న అపోహను తొలగించారు.
శ్మశాన వాటికలో పాత సమాధులను తొలగించి.. ఓ చిన్న శివాలయాన్ని నిర్మించారు.