కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వానికి తమ పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వబోదని జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనిని జేడీఎస్ వ్యతిరేకించదు అని ఆయన పేర్కొన్నారు.
స్వాగతిస్తున్నా..
సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం తనకు పెద్దవిషయమేమీ కాదని దేవెగౌడ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షంపై ప్రతీకార రాజకీయాలు చేయబోనని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.
"మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ఓ ప్రాంతీయ రాజకీయపార్టీగా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకిస్తాం. వారు (యడియూరప్ప) రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే స్వాగతిస్తాం."-దేవెగౌడ, జేడీఎస్ అధినేత