ఎటు చూసినా కెమెరాలు.. ఎక్కడికక్కడ నిఘా పరికరాలు.. ఇది పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో ఉన్న ఆ పర్వతం పరిస్థితి. అయితే వీటన్నింటినీ దీటుగా ఎదుర్కొని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కన్నా ముందే భారత సైన్యం ఆ కీలక పర్వత ప్రాంతాన్ని చేజిక్కించుకుంది.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా సైన్యం అత్యాధునిక కెమెరాలను వినియోగించి భారత ఆర్మీ కదలికలను పసిగడుతున్నట్లు తెలుస్తోంది. భారత బలగాలు గస్తీ నిర్వించే సమయంలో చైనా జవాన్లు సత్వరమే అప్రమత్తమై, అడ్డుపడటానికి ఈ పరికరాలు సహాయపడుతున్నట్లు తెలిసింది.
అయితే మన ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న ఈ కీలక పర్వత శిఖరంపై పాగా వేసిన వెంటనే భారత బలగాలు కెమెరాలను, నిఘా పరికరాలను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బుకాయింపు...
భారత్ ఆక్రమించిన పర్వత ప్రాంతాన్ని తమదిగా చైనా వాదిస్తోంది. అయితే పాంగాంగ్ దక్షిణ తీర ప్రాంతంపై పట్టు సాధించేందుకు ఈ పర్వత శిఖరం ఉపయోగపడుతుంది. అంతేకాదు చైనా సాయుధ బలగాలను మోహరించిన స్పంగూర్ గ్యాప్ ప్రాంతంపైనా నిఘా ఉంచేందుకు ఇది కీలకం కానుంది.
గట్టిగా బదులిస్తాం...