తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా షూ పాలిష్​' - Narendra modi

భాజపా పాలనకు నిరసనగా ఎన్​ఎస్​యూఐ దేశ వ్యాప్తంగా 'షూ పాలిస్'​ కార్యక్రమం నిర్వహించింది. నిరుద్యోగ సమస్య తీవ్రమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్​ఎస్​యుఐ(నేషనల్​ స్టూడెంట్స్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా)

By

Published : Mar 7, 2019, 7:39 AM IST

Updated : Mar 7, 2019, 9:05 AM IST

నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి సంఘం ఎన్​ఎస్​యుఐ(నేషనల్​ స్టూడెంట్స్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా) ఆరోపించింది. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు దిల్లీ యూనివర్సిటీలో 'షూ పాలిష్'​ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఇదేతరహా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పాలనపై తమ నిరసనను తెలియజేసింది.

కేంద్ర ప్రభుత్వం దేశ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన హామీలు నెరవేర్చలేదని ఎన్​ఎస్​యుఐ నేతలు ఆరోపించారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Last Updated : Mar 7, 2019, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details