కరోనా నుంచి రక్షణకు 'సామాజిక దూరం' పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు సూచించాయి. అయితే, ఈ పదం వల్ల కరోనా రోగులు, వారి కుటుంబాలు సామాజిక వివక్షకు గురవుతున్నాయని రాజ్యసభ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దానికి బదులుగా 'భౌతిక దూరం' అనే పదాన్ని ఉపయోగించాలని డిమాండ్ చేశారు. సభ్యుల సూచనను అంగీకరించిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. సరైన పదాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. 'సురక్షిత దూరం' అనే పదాన్ని సూచించారు వెంకయ్య.