ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై పోలీసులు 436 కేసులు నమోదు చేశారు. 1,427 మందిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో 45 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి. అయితే గత ఆరు రోజులుగా అల్లర్లపై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి ఫోన్లు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
దిల్లీ హింసపై 436 కేసులు.. 1,400 మంది అరెస్టు
దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో 436 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 1,427 మందిని అరెస్టు చేశారు. ఇందులో 45 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి.
దిల్లీ హింస: 436 కేసులు నమోదు.. 1,400 మంది అరెస్టు
ఈశాన్య దిల్లీలో గతవారం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అనేక ప్రాంతాల్లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి.