భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..
బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మిగతా ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ అభ్యర్థుల ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అటు.. ఎన్డీఏ కూటమి నుంచి లోక్‌జనశక్తి పార్టీ వైదొలిగిన నేపథ్యంలో ఆ అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికల బరిలో నిలుస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది.