ఘుమఘుమలాడే చికెన్, మటన్ బిర్యానీ... పరాఠా వంటి కొవ్వు పదార్థాలను జోడించిన ఆహారాన్ని దిల్లీ వాసులే ఎక్కువగా ఆరగిస్తున్నారట. 7 మెట్రో నగరాల్లో ఆహార అలవాట్ల ఆధారంగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వాటికి ర్యాంకులు కేటాయించింది. ఇందులో దిల్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించగా... హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. మగవారు సగటున రోజూ 34.1 గ్రాముల కొవ్వును వినియోగిస్తుండగా, మహిళలు 31.1 గ్రాములు తీసుకుంటున్నట్టు ఐసీఎంఆర్ లెక్కగట్టింది. 36-59 ఏళ్ల వయసువారు ఆహారంలో భాగంగా నిత్యం 36.9 గ్రాముల కొవ్వును ఆరగిస్తున్నట్టు పేర్కొంది.
మెట్రో వాసులను 'కొవ్వి'స్తున్న ఆహారం - కొవ్వు ఆహార పదార్థాలు
రోజూవారి ఉరుకుల పరుగుల జీవిత ప్రభావం తినే ఆహారంపైనా చూపుతోంది. తాజాగా దేశంలోని మెట్రో నగరాల్లో కొవ్వు ఆహార పదార్థాలను ఎంతమేరకు తీసుకుంటున్నారనే విషయంపై జాతీయ వైద్య పరిశోధన మండలి సర్వే నిర్వహించింది. ఇందులో తొలి స్థానంలో నిలిచింది దేశ రాజధాని దిల్లీ. మరి ఇతర నగరాల పరిస్థితి ఏంటి?
మెట్రో వాసులను 'కొవ్వి'స్తున్న ఆహారం
కొవ్వు పదార్థాల వినియోగం రోజుకు గ్రాముల్లో
Last Updated : Mar 2, 2020, 3:39 AM IST