మద్యం బాటిళ్లపై విధించిన ప్రత్యేక కరోనా ఫీజును 70శాతం ఉపసహరించుకోనుంది దిల్లీ ప్రభుత్వం. ఈ ఉపసంహరణ రేట్లు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే అన్ని రకాల మద్యం ధరలపై విధించే వ్యాట్‌ను 20 నుంచి 25శాతం వరకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.