సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్! - LATEST CAA PROTEST
దిల్లీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హింసను ప్రేరేపించే సందేశాలను ఎవరైనా పంపిస్తే వారిపై వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది దీల్లీ సర్కారు.
విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్
విద్వేషపూరిత సందేశాలు ఎవరైనా పంపిస్తే నేరుగా ఆ వాట్సప్ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో పుకార్లను అరికట్టేందుకే ఈ వాట్సప్ నంబర్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో నంబర్‌ను ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
Last Updated : Mar 2, 2020, 10:55 PM IST