వ్యాక్సినేషన్ మొదటిదశలో భాగంగా 51లక్షలమంది దిల్లీ వాసులకు టీకా వేయనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ప్రాధాన్యతానుసరించి వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు అన్ని సమకూర్చామన్నారు.
‘‘ఆరోగ్య కార్యకర్తలు సహా మొత్తం 51లక్షల మందికి మొదటి దశలో వ్యాక్సిన్ అందించనున్నాం. వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాల్సిన వారి వివరాలను ఇప్పటికే సేకరించాం.’’ అని చెప్పారు కేజ్రీవాల్. మొదటిదశలో గుర్తించిన వారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికోసం మొత్తం కోటికి పైగా వ్యాక్సిన్‌లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముందుగానే మేసేజ్ ద్వారా సమాచారమిస్తామన్నారు. తర్వాత వారు వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.