తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఎగ్జిట్​ పోల్స్​​: మళ్లీ ఆప్​కే అధికారం! - delhi exit polls updates

దేశ రాజధాని దిల్లీలో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేశాయి. అన్ని సర్వేలు ఆప్ విజయం తథ్యమని స్పష్టం చేశాయి.

delhi-exit-polls-aap-to-get-power-again
కేజ్రీవాల్​కే దిల్లీ పట్టం

By

Published : Feb 8, 2020, 7:14 PM IST

Updated : Feb 29, 2020, 4:15 PM IST

హస్తిన పీఠం మరోమారు 'ఆమ్​ఆద్మీ'దేనా? అరవింద్ కేజ్రీవాల్​ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమా? ఔననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. దాదాపు అన్ని సర్వేలు ఆప్​ విజయం తథ్యమని అంచనా వేశాయి.

2015తో పోల్చితే ఆప్​ ఆధిక్యం కాస్త తగ్గినా... ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటుందని విశ్లేషించాయి. భాజపా కాస్త పుంజుకుంటుందని, కాంగ్రెస్​ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవచ్చని అంచనా వేశాయి.

టైమ్స్​ నౌ- ఐపీఎస్​ఓఎస్​ సర్వే

  • ఆప్: 44
  • భాజపా+: 26
  • కాంగ్రెస్​: 0
  • ఇతరులు: 0

రిపబ్లిక్​ టీవీ- జన్​ కీ బాత్​ సర్వే

  • ఆప్: 48-61
  • భాజపా+: 9-21
  • కాంగ్రెస్​: 0-1
  • ఇతరులు: 0

నేత- న్యూస్​ ఎక్స్​ సర్వే

  • ఆప్: 53-57
  • భాజపా+: 11-17
  • కాంగ్రెస్​: 0-2
  • ఇతరులు: 0

ఏబీపీ- సి-ఓటర్​

  • ఆప్: 49-63
  • భాజపా+: 5-19
  • కాంగ్రెస్​: 0-4
  • ఇతరులు: 0

న్యూస్​ఎక్స్​-పోల్​స్ట్రాట్​

  • ఆప్: 50-56
  • భాజపా+: 10-14
  • కాంగ్రెస్​: 0
  • ఇతరులు: 0

దిల్లీలో మొత్తం 70 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే కనీసం 36 స్థానాలు గెలుచుకోవడం అవసరం. 2015 ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టించింది. భాజపా 3 స్థానాలకు పరిమితమవగా... కాంగ్రెస్​ అసలు ఖాతా తెరవలేదు.

దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితం ఈనెల 11న వెలువడనుంది. ఎగ్జిట్​ పోల్స్​ ఎంతమేర నిజం అయ్యాయో అదే రోజు తేలనుంది.

Last Updated : Feb 29, 2020, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details