తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఎన్నికలపై బిహార్​లో రగడ.. నితీశ్​ X ప్రశాంత్​

జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​, ఆ పార్టీలో కీలక నేత ప్రశాంత్​ కిశోర్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపాపై ప్రశాంత్ కిశోర్​ విమర్శలు చేసిన నేపథ్యంలో.. పార్టీలో కొనసాగాలనుకుంటే మిత్రపక్షాలతో సరిగ్గా నడుచుకోవాలన్నారు నితీశ్​.

delhi dangal
delhi dangal

By

Published : Jan 29, 2020, 9:37 AM IST

Updated : Feb 28, 2020, 9:08 AM IST

ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్​కు ఆ పార్టీ అధినేత నితీశ్​ కుమార్​ మధ్య మంగళవారం తీవ్ర మాటల యుద్ధం జరిగింది. పార్టీలో కొనసాగాలా.. వద్దా.. అని ప్రశాంత్​ కిశోర్​ తేల్చుకోవాలని నితీశ్ వ్యాఖ్యానించారు.

ప్రశాంత్​ కిశోర్​ 2018 సెప్టెంబర్​లో జేడీయూలో చేరారు. నితీశ్​ కుమార్​ ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే జేడీయూ మిత్రపక్షమైన భాజపాపై ప్రశాంత్​ కిశోర్​ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో ఆ పార్టీని సమర్థించాలన్న జేడీయూ నిర్ణయాన్ని కిశోర్​ తప్పుబడుతున్నారు.

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కన్నా ఎక్కువ సీట్లలో తమ పార్టీ పోటీ చేయాలన్నారు. దీనికితోడు దిల్లీలో ఆమ్​ఆద్మీ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు. అక్కడ ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు ఆప్​తో తలపడుతున్నాయి.

నితీశ్​ స్పందన

ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా అగ్రనేత అమిత్​షాపై ప్రశాంత్​ కిశోర్​ గుప్పిస్తున్న విమర్శలు, వాటివల్ల భాజపాతో జేడీయూ మైత్రిపై పడే ప్రభావం గురించి నితీశ్​ను విలేకరులు ప్రశ్నించారు.

"వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా ఆయన ఆప్​తో పనిచేస్తున్నారు. ఆ పార్టీతో ఆయన పనిచేస్తున్నారని పత్రికల్లోనే చూశా. అమిత్​ షా సిఫార్సు మేరకే ఆయనను పార్టీలో చేర్చుకున్నా. ప్రశాంత్​.. పార్టీలో కొనసాగితే సంతోషిస్తా. అందుకు భిన్నమైన ఆలోచన చేసినా నాకు సమ్మతమే. ఒకవేళ కొనసాగాలని నిర్ణయించకుంటే పార్టీ యంత్రాంగాన్ని ఆయన గౌరవించాల్సిందే."

-నితీశ్ కుమార్​, బిహార్ ముఖ్యమంత్రి

'నితీశ్​ వ్యాఖ్యలు అబద్ధం'

దీనిపై ప్రశాంత్ కిశోర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తన చేరికపై నితీశ్​ వ్యాఖ్యలు అబద్ధమన్నారు.

"మీ రంగులను నాకు పులిమేందుకు యత్నిస్తున్నారు. ఒకవేళ మీరు చెబుతున్నదే నిజమనుకుంటే.. అమిత్​ షా సిఫార్సు చేసిన వ్యక్తి వాదనను పెడచెవిన పెట్టే ధైర్యం మీకు ఉంటుందని ఎవరు నమ్ముతారు."

-ప్రశాంత్​ కిశోర్​, జేడీయూ పార్టీ నేత

Last Updated : Feb 28, 2020, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details