తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాలకు వెళ్లేందుకు వాద్రాకు కోర్టు అనుమతి - robert vadra

ఆరు వారాల పాటు విదేశాల్లో పర్యటించేందుకు రాబర్ట్​ వాద్రాకు దిల్లీ కోర్టు అనుమతిచ్చింది. వైద్యం నిమిత్తం అమెరికా, నెదర్లాండ్స్ దేశాలకు వెళ్లేందుకు అంగీకారం తెలిపింది. లండన్ వెళ్లేందుకు మాత్రం అనుమతి నిరాకరించింది న్యాయస్థానం.

విదేశాలకు వెళ్లేందుకు వాద్రాకు కోర్టు అనుమతి

By

Published : Jun 3, 2019, 4:50 PM IST

Updated : Jun 4, 2019, 1:38 AM IST

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్​ వాద్రాకు ఊరటనిచ్చింది దిల్లీ కోర్టు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. వైద్యం నిమిత్తం ఆరువారాల పాటు అమెరికా, నెదర్లాండ్స్​ల్లో పర్యటించేందుకు అంగీకారం తెలిపింది. లండన్ వెళ్లేందుకు మాత్రం అంగీకరించలేదు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికను సమర్పించాలని వాద్రాను ఆదేశించింది.

విదేశీ పర్యటనలో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్​​ డైరెక్టరేట్​ అనుమతి లేకుండా వాద్రా లండన్ వెళ్లరని కోర్టుకు తెలిపారు ఆయన తరఫు న్యాయవాది.

లండన్ వెళ్లాలన్న వాద్రా వినతిని వ్యతిరేకించారు ఈడీ తరఫు న్యాయవాది.

లండన్​లో 1.9మిలియన్ పౌండ్లు విలువ చేసే భవానాన్ని వాద్రా అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి.

ఇదీ చూడండి: బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్​, స్మృతి

Last Updated : Jun 4, 2019, 1:38 AM IST

ABOUT THE AUTHOR

...view details