తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఆప్​తో పొత్తుపై రాహుల్​దే తుది నిర్ణయం" - alliance

లోక్​సభ ఎన్నికల్లో దిల్లీలో ఆమ్​ఆద్మీతో పొత్తు విషయంపై కాంగ్రెస్​ చర్చలు ఓ కొలిక్కిరాలేదు. ఈ విషయంపై పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తుది నిర్ణయం రాహుల్​ గాంధీదేనని నిర్ణయించారు. కూటమిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆప్.

ఆప్​తో పొత్తుపై రాహుల్​ గాంధీదే తుది నిర్ణయం

By

Published : Mar 25, 2019, 4:22 PM IST

ఆప్​తో పొత్తుపై రాహుల్​ గాంధీదే తుది నిర్ణయం
లోక్​సభ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీతో కాంగ్రెస్​ పొత్తు ఉంటుందా... లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై కాంగ్రెస్​ దిల్లీ నేతలు నేడు రాహుల్​ గాంధీతో చర్చించారు.

నేతల భిన్నాభిప్రాయాలు

దిల్లీ కాంగ్రెస్​ అధ్యక్షురాలు షీలా దీక్షిత్​, ఇతర ముఖ్య నాయకులు దిల్లీలో ఆమ్​ఆద్మీతో కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీతో చర్చించారు. పొత్తులపై ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాహుల్​ గాంధీదే తుది నిర్ణయమని ఏకగ్రీవంగా నిర్ణయించారు నేతలు.

దిల్లీ కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు అజయ్​ మాకెన్​, సుభాశ్​ చోప్రా, తజ్దార్​ బాబర్​, అరవింద్​ సింగ్​లు ఆప్​తో పొత్తుపై సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్​తో కూటమికి అనుకూలంగా ఉన్నట్లు 12 జిల్లాల అధ్యక్షులు, నాయకులు, మూడు పురపాలక కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖను ​రాహుల్​ గాంధీకి అందించారు ఏఐసీసీ దిల్లీ ఇన్​ఛార్జీ పీసీ చాకో.

దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్​, వర్కింగ్​ ప్రెసిడెంట్లు దేవేందర్​ యాదవ్, రాజేశ్​ లిలోతియా, హరూన్​ యూసుఫ్​లు ఆప్​తో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఆప్​

కాంగ్రెస్​తో పొత్తుకు ఆమ్​ఆద్మీ సుముఖంగా ఉంది. కాంగ్రెస్​ మాత్రం ఎటూ తేల్చలేదు. దీంతో లోక్​సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆమ్​ ఆద్మీ. కూటమి ఏర్పాటుపై కాంగ్రెస్​ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆప్​ పేర్కొంది. దిల్లీలో ఒంటరిగానే పోటీ చేసి ఏడు స్థానాలను గెలుచుకునే సత్తా తమ పార్టీకి ఉన్నట్లు ఇప్పటికే ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ పేర్కొన్నారు.

గత మంగళవారం కూటమి ఏర్పాటుపై ఆప్​ను సంప్రదించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవర్​. దిల్లీతో పాటు పంజాబ్​, హరియాణాలో సైతం కూటమి ఏర్పాటుకు సహకరించాలని ఆప్​ను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details