తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రుతుపవనాల ఆలస్యంతో తగ్గిన వర్షపాతం

రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల జూన్​ నెల మొదటి 9 రోజుల్లో 45% వర్షపాతం తగ్గినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా జూన్​ 8న కేరళను తాకాయి. ఈ కారణంతో వర్షపాతం తగ్గినట్లు ఐఎమ్​డీ పేర్కొంది.

రుతుపవనాలు ఆలస్యం- తగ్గిన వర్షపాతం

By

Published : Jun 10, 2019, 8:32 AM IST

రుతుపవనాల ఆలస్యంతో తగ్గిన వర్షపాతం

భారత్​లోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేసించడం వర్షపాతంపై గణనీయమైన ప్రభావం చూపిందని భారత వాతావరణ విభాగం (ఐఎమ్​డీ) తెలిపింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు భారత్​లోకి​ ప్రవేశించాల్సి ఉంది. అయితే వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న కేరళ తీరాన్ని తాకాయి.

ఈ కారణంగా గత 9 రోజుల్లో 45 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఐఎమ్​డీ పేర్కొంది. సాధారణంగా ఈ పాటికి 32.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 17.7 మి.మీ వర్షం మాత్రమే కురిసిందని తెలిపింది.

రుతుపవనాల మందకొడి కారణంగా జూన్​లో లోటు వర్షపాతం ఊహించినదాని కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ఇది క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశముందని తెలిపింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఒడిశా, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో 66 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. దక్షిణాదిన లోటు వర్షపాతం 29 శాతంగా ఉనట్లు చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details