తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైఫిళ్ల సేకరణకు రక్షణ శాఖ అంగీకారం - defence

సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్ని నవీకరించేందుకు అమెరికా నుంచి 73 వేల సిగ్ సౌర్ అసాల్ట్ తుపాకుల కొనుగోలుకు రక్షణ శాఖ అంగీకారం తెలిపింది.

నిర్మలా సీతారామన్​, రక్షణశాఖ మంత్రి

By

Published : Feb 2, 2019, 3:44 PM IST

ఆయుధ సంపత్తిని నవీకరించే దిశగా అడుగులు వేస్తోంది భారత రక్షణ శాఖ. అమెరికాకు చెందిన 73వేల సిగ్ సౌర్​ అసాల్ట్​ రైఫిళ్లు కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సైనిక పటాలాలు ఇప్పటి వరకు వినియోగిస్తున్న ఇన్సాస్ తుపాకుల స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు. మరో వారంలో ఒప్పందం తుదిరూపునకు వచ్చే అవకాశం ఉందని, ఏడాదిలోగా నూతన రైఫిళ్లు భారత సైన్యానికి చేరనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

చైనాతో 3600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్​ ఆ రేఖ వద్ద ఉన్న దళాలకు ఈ అసాల్ట్​ రైఫిళ్లను అందించనుంది.

2017 అక్టోబర్​లోనే ఆయుధ నవీకరణ ప్రక్రియను ప్రారంభించింది రక్షణశాఖ. అమెరికా సహా పలు ఐరోపా దేశాలు ఈ సిగ్ సౌర్​ రైఫిళ్లను వారి దళాల్లో వినియోగిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details