తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో సైన్యం సన్నద్ధతపై రాజ్​నాథ్ సమీక్ష - defence minister rajnath singh

సరిహద్దులో సైనిక సన్నద్ధతపై ఉన్నతస్థాయి రక్షణ అధికారులతో సమీక్షించారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. తూర్పు లద్దాఖ్​ సహా చైనా సరిహద్దులో సైన్యం పరిస్థితిపై చర్చించారు. వచ్చేవారం మేజర్ జనరల్ స్థాయిలో ఇరుదేశాల మధ్య సమావేశం జరగాల్సిన నేపథ్యంలో రాజ్​నాథ్ సమీక్ష చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

rajnath
చైనాతో సరిహద్దులో సైన్యం సన్నద్ధతపై రాజ్​నాథ్ సమీక్ష

By

Published : Jun 12, 2020, 10:10 PM IST

Updated : Jun 12, 2020, 11:06 PM IST

తూర్పు లద్దాక్​ సహా చైనా సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్​ల్లో సైన్యం పరిస్థితిపై ఆరా తీశారు. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-చైనా మధ్య మేజర్ జనరల్ స్థాయిలో మరోసారి చర్చలు జరగాల్సి ఉండగానే.. రక్షణమంత్రి సైనిక సన్నద్ధతపై సమీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె, నౌకాదళ ప్రధానాధికారి కరంబీర్ సింగ్, వాయుసేన చీఫ్ బదౌరియా ఈ సమావేశానికి హాజరయ్యారు. తూర్పు లద్దాఖ్​​లో సైన్యం పరిస్థితిపై రాజ్​నాథ్​కు కూలంకషంగా వివరించారు నరవాణె. తూర్పు లద్దాఖ్​​లో పరిస్థితని చేయి దాటిపోనివ్వద్దని, భారత వాదనపై పటిష్ఠంగా నిలవాలని అగ్రశ్రేణి రక్షణ అధికారులకు రాజ్​నాథ్ సూచించారని తెలుస్తోంది.

భారత్, చైనా ఆర్మీ మధ్య పాంగాంగ్, గాల్వన్ లోయ, దెమ్​చొక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల వద్ద ఐదువారాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాలు అదనపు సైనిక బలగాలను సరిహద్దు వెంట మోహరించాయి. ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఇప్పటికే మేజర్ జనరల్స్​ స్థాయిలో సమావేశం జరిగింది. వచ్చేవారం ఫీల్డ్ కమాండర్ స్థాయిలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులో సైనిక సన్నద్ధతపై రక్షణమంత్రి సమీక్ష చేశారని తెలుస్తోంది.

ఇదీ చూడండి:'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి

Last Updated : Jun 12, 2020, 11:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details