జమ్ముకశ్మీర్ హంద్వారా ఎన్కౌంటర్పై రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. ఉగ్రవాదులపై పోరులో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. భారత సైనికులు ధైర్యసాహసాలను ప్రదర్శించారని.. వారి త్యాగాన్ని దేశం మరిచిపోదని ట్వీట్ చేశారు.
"హంద్వారాలో జవాన్లు, భద్రతా సిబ్బందిని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో వారు ఎనలేని ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దేశం కోసం అతిపెద్ద త్యాగం చేశారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలు ఎన్నటికీ మరచిపోము. వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నా. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు దేశం అండగా ఉంటుంది."
-- రాజ్నాథ్ సింగ్, రక్షణమంత్రి.