తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాన్న మంత్రి- కుమార్తె డాక్టర్- దీదీకి ఫైర్​

బంగాల్​లో వైద్యుల సమ్మె 5వ రోజు కొనసాగుతోంది. జూడాల నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. వైద్యురాలు, బంగాల్​ మంత్రి ఫిర్హద్​ హకిమ్​ కుమార్తె షబ్బా హకిమ్​ వైద్యులకు మద్దతుగా నిలిచారు. మమత సర్కార్​పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు.

నాన్న మంత్రి- కుమార్తె డాక్టర్- దీదీకి ఫైర్​

By

Published : Jun 15, 2019, 8:03 PM IST

Updated : Jun 15, 2019, 8:08 PM IST

బంగాల్​లో వైద్యుల సమ్మెకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ వివాదం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

స్వయానా బంగాల్​ మంత్రి, కోల్​కతా మేయర్ కుమార్తె కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా, కోల్​కతా మేయర్​గా ఉన్న ఫిర్హద్​ హకిమ్​ కుమార్తె షబ్బా హకిమ్​ ఓ వైద్యురాలు. దాడులకు వ్యతిరేకంగా జూడాలు చేపట్టిన పోరాటాన్ని షబ్బా సమర్థించారు. పని ప్రదేశంలో భద్రత ఆశించడం, శాంతియుతంగా నిరసనలు తెలపడం తమ హక్కు అని ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు. ఆసుపత్రుల్లో గుండాలు తిరుగుతూ వైద్యులను ఎందుకు హింసిస్తున్నారని ప్రశ్నించారు షబ్బా.

"ఇంత జరుగుతున్నప్పటికీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. తృణమూల్​ కాంగ్రెస్ మద్దతురాలిగా వారి ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నా.​ రోగులు ఇబ్బంది పడుతున్నారని అంటున్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వైద్యులను రక్షించడానికి ఆసుపత్రుల్లోని పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని నిలదీయాలి. గూండాలు దాడి చేసినప్పుడు వెంటనే ఎందుకు స్పందిచలేదని అడగాలి."
--- షబ్బా హకిమ్​, బంగాల్​ మంత్రి​ కుమార్తె.

ఇదీ జరిగింది...

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు దిగారు.

Last Updated : Jun 15, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details