ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర వైద్య శాఖ మరోసారి స్పష్టం చేసింది. తక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతున్నట్లు వెల్లడించింది. ఆగస్టు తొలి వారంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11శాతం ఉండగా ప్రస్తుతం అది 8శాతానికి తగ్గిందని తెలిపింది.
ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం ఉండగా, మరో 22.2శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.92శాతం ఉందని తెలిపారు.
100 శాతానికిపైగా రికవరీ
కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం వల్ల దేశంలో యాక్టివ్ కేసుల లోడ్ తగ్గుతోందని చెప్పారు రాజేష్. ప్రస్తుతం దేశంలో 7,04,348 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. గత 25 రోజుల్లో రికవరీల సంఖ్య 100 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు.
- యాక్టివ్ కేసుల్లో 2.7 శాతం బాధితులకు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు.
- 1.92 శాతం మంది ఐసీయూలో ఉంటున్నారు.
- 0.29 శాతం మంది బాధితులు వెంటిలేటర్‌పై ఉన్నారు.
- కరోనా మరణాలలో పురుషులు 69 శాతంగా ఉంటే.. మహిళలు 31 శాతం.
టెస్టులు ఇలా...