తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన వంతెన... ఐదుగురి మృతి - వంతెన

ముంబయిలోని ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్​ సమీపంలోని ఓ పాదచారుల వంతెన కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 29మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో సమీపంలోని కూడలిలో రెడ్​ సిగ్నల్​ పడటం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఘటనపై ప్రధాని సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కూలిన 'కసబ్​' వంతెన-పెరుగుతున్న మృతుల సంఖ్య

By

Published : Mar 14, 2019, 11:51 PM IST

Updated : Mar 15, 2019, 12:04 AM IST

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పాదచారుల వంతెన కుప్పకూలింది. ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్​(సీఎస్​ఎమ్​టీ) సమీపంలో ఈ ఘటన జరిగింది. రాత్రి 7గంటల 30 నిమిషాల ప్రాంతంలో వంతెన కుప్పకూలింది. ఘటనాస్థలానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరో 8-10 మంది చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడం వల్ల పోలీసులు ట్రాఫిక్​ ఇక్కట్లు కలగకుండా చర్యలు చేపట్టారు.

'కసబ్​' వంతెన...

టైమ్స్​ ఆఫ్​ ఇండియా భవంతి- సీఎస్ఎమ్​టీ స్టేషన్​ను కలిపే ఈ వంతెనను 26/11 ముంబయి ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వినియోగించారు. అందుకే ఈ వంతెనకు 'కసబ్​ వంతెన' అని పేరుపెట్టారు.

Last Updated : Mar 15, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details