తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళా హాస్టల్లోకి అనుమతించలేదని దాడి - భాస్కర్​రెడ్డి

కర్ణాటక మంగమ్మన్​పాళ్యలో దారుణం జరిగింది. మహిళా హాస్టల్​లో మద్యం సేవించడానికి నిరాకరించినందుకు, ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి ఘోరంగా గాయపరిచారు దుండగులు.

మహిళా హాస్టల్లోకి అనుమతించలేదని దాడి

By

Published : Apr 6, 2019, 7:32 PM IST

మహిళా హాస్టల్లోకి అనుమతించలేదని దాడి

కర్ణాటక బెంగళూరు సమీపంలోని మంగమ్మన్​పాళ్యలో గ్రీన్​హౌస్​ మహిళా హాస్టల్​ను కడపకు చెందిన భాస్కర్​రెడ్డి గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్​ 2న కొంత మంది యువకులు వచ్చి, మద్యం సేవించడానికి హాస్టల్​లోకి వెళ్లబోయారు. వీరిని భాస్కర్​రెడ్డి, అతని తమ్ముడు జగన్​రెడ్డి, స్నేహితుడు అనిల్​కుమార్​ అడ్డుకున్నారు.

ఆగ్రహించిన యువకుల బృందం నడిరోడ్డుపైనే బాధితులు ముగ్గురిపై దాడిచేసి దారుణంగా గాయపరిచారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా గాయపడిన అనిల్​కుమార్​ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సాగర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details