తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో మోదీపై చనిపోయిన వ్యక్తి పోటీ! - మృతి చెందిన వ్యక్తి

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు చనిపోయిన వ్యక్తి రామ్ అవతార్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ఆజమ్​గఢ్ జిల్లా గోవింద్ పట్టీకి చెందిన యాదవ్... తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకే ప్రధానిపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

వారణాసిలో మోదీపై చనిపోయిన వ్యక్తి పోటీ

By

Published : Apr 13, 2019, 6:30 AM IST

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై మరో వ్యక్తి పోటీకి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఓ జవాను.. వారణాసిలో నామపత్రం దాఖలు చేశారు. ఇప్పడు ఓ చనిపోయిన వ్యక్తి మోదీపై పోటీ చేస్తానంటున్నాడు. చనిపోయిన వ్యక్తి పోటీ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు రామ్ అవతార్ అనే వ్యక్తి​.

అసలు కథ ఏంటంటే..?

2005లో రామ్​ అవతార్ యాదవ్​ చనిపోయినట్లు తప్పడు ధ్రువపత్రాలు సృష్టించి ఆయనకున్న మూడున్నర ఎకరాల భూమిని ఒక భూస్వామి తన పేరు మీదకు మార్చుకున్నాడు.

తాను చనిపోలేదని నిరూపించుకోవడానికి రామ్​ యాదవ్​కు 8 ఏళ్లు పట్టింది. దీని కోసం మండల అధికారులను, జిల్లా అధికారులను, అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​నూ కలిశారు.

నవంబర్​ 2013లో తాను బ్రతికే ఉన్నట్లు అధికారికంగా నిరూపించుకున్నారు. కాని ఇప్పటికీ తన మూడున్నర ఎకారాల భూమి తనకు దక్కలేదు. ఆ భూమి కబ్జాకు గురైంది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు రామ్ యాదల్ ప్రధానిపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details