బిహార్ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జన్మదిన వేడుకలను కుటుంబసభ్యులు, మద్దతుదారులు ఘనంగా నిర్వహించారు. 31వ వసంతంలోకి అడుగుపెట్టిన తేజస్వీకి కుటుంబ సభ్యులు రబ్రీ దేవీ, తేజ్ ప్రతాప్ యాదవ్, మిసా భారతి శుభాకాంక్షలు తెలిపారు.
తేజస్వీ జన్మదిన వేడుకల్లో 'ఫలితాల' జోష్ - తేజస్వీ యాదవ్ వార్తలు
ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ 31వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఘనంగా నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాకూటమికే అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పట్నా వీధుల్లో సంబరాలు చేసుకున్నారు.
తేజస్వీ జన్మదిన వేడుకలు
పట్నా వీధుల్లో తేజస్వీ మద్దతుదారులు సంబరాలు నిర్వహించారు. రబ్రీ దేవీ అధికారిక నివాసం వద్దకు ఆర్జేడీ కార్యకర్తలు చేరుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాకూటమికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ట్రంప్ ఓటమి.. భారత్కు పాఠం లాంటిది: శివసేన