తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఉగ్రవాది ఇంట్లో పేలుడు జాకెట్లు, ఐసిస్ జెండాలు - ISIS terrorist arrest in delhi

దిల్లీలో శనివారం అరెస్టైన ఐసిస్​ ఉగ్రవాది నివాసంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసకున్నారు అధికారులు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆ ఉగ్రవాది ఇంట్లో విస్ఫోటక జాకెట్లు, ఐసిస్ జెండాలు బయటపడ్డాయి. తన భర్త ఉగ్ర కార్యకలాపాలకు సహకరించినట్లు అతని భార్య అంగీకరించారు. క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నారు.

day-after-isis-operatives-arrest-huge-amount-of-explosives-recovered-in-ups-balrampur
ఉగ్రవాది ఇంట్లో పేలుడు జాకెట్లు, ఐసిస్ జెండాలు

By

Published : Aug 23, 2020, 1:34 PM IST

దిల్లీలో భారీ ఉగ్రదాడికి యత్నించి పట్టుబడ్డ ఐసిస్‌ ఉగ్రవాది అబూ యూసఫ్‌ ఇంట్లో నుంచి పేలుడు పదార్థాలు, ఐసిస్‌ జెండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబూ యూసఫ్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌, బలరాం‌పుర్‌లోని ఇంటి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉగ్రవాది ఇంట్లో పేలుడు జాకెట్లు

అబూ యూసఫ్‌ ఇంట్లో గన్‌పౌడర్‌ సహా ఇతర పేలుడు పదార్థాలను దాచినట్లు.. అతడి భార్య అంగీకరించారు. ఇలాంటి పనులు వద్దని వారించినప్పటికీ.. తనకు అడ్డు రాకూడదని యూసఫ్​ చెప్పినట్లు ఆమె తెలిపారు. తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని, నలుగురు పిల్లలున్న తన పరిస్థితి ఏంటని ఉగ్రవాది భార్య వాపోయారు.

ఉగ్రవాది యూసఫ్​ భార్య

దిల్లీలో ఐసిస్​ ఉగ్రవాది అరెస్ట్​తో అప్రమత్తమయ్యారు యూపీ అధికారులు. అయోధ్య రామాలయ నిర్మాణం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో హై అలర్ట్​ ప్రకటించారు. భారీగా బలగాలను మోహరించి.. తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లోనే అబు యూసఫ్ నివాసంలో పేలుడు జాకెట్ బయటపడినట్లు వెల్లడించారు. ఉగ్రదాడికి దిగేందుకే ఈ జాకెట్ సిద్ధం చేయించినట్లు పేర్కొన్నారు.

ఉగ్రవాది ఇంట్లో ఐసిస్ జెండాలు
ఉగ్రవాది ఇంట్లో పేలుడు పదార్థాలు
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఇదీ చదవండి: ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్​తో అయోధ్యలో హైఅలర్ట్​

ABOUT THE AUTHOR

...view details