దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో తాజాగా ఓ ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది..

ఈ నెల 7న సీహోర్లో ఓ మహిళ మలవిసర్జన కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. అదే సమయంలో ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాధితురాలు స్థానిక పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనలో దేవాస్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు(ధర్మేంద్రసింగ్ రాజ్పుత్, భావర్సిగ్ రాఠోడ్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-376 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:సోమవారం కోర్టు ముందుకు 'హాథ్రస్' కుటుంబం