మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు బౌద్ధ గురువు దలైలామ. ఓ వార్తా ఛానల్‌కు ఆయన ఇచ్చిన ముఖాముఖిలో తన వారసులుగా మహిళ వస్తే అందంగా ఉండాలంటూ చమత్కరించారాయన. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని ఒక ప్రకటన విడుదల చేసింది దలైలామ కార్యాలయం. ఆయన గతంలో మహిళలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. వారి హక్కుల కోసం, లింగ సమానత్వం కోసం పోరాడినట్లు ప్రకటనలో తెలిపింది.
"దలైలామా పవిత్రతపై ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ కల్గిస్తే క్షమాపణలు తెలియజేస్తున్నాం."