తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఆసుపత్రిలో దలైలామా- స్థిరంగా ఆరోగ్యం

టిబెట్​ ఆధ్యాత్మిక గురువు దలైలామా.. అనారోగ్యంతో దిల్లీలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేరారు. ఛాతినొప్పితో చికిత్స నిమిత్తం వచ్చారని, ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

దలైలామా

By

Published : Apr 10, 2019, 2:47 PM IST

Updated : Apr 10, 2019, 3:44 PM IST

స్థిరంగా దలైలామా ఆరోగ్యం

టిబెట్​ ఆధ్యాత్మిక గురువు దలైలామా దిల్లీలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి కారణంగా సాధారణ పరీక్షల కోసం వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు వైద్యులు.

83 ఏళ్ల 14వ దలైలామా ధర్మశాలలో జరుగుతున్న గ్లోబల్​ లెర్నింగ్ కాన్ఫరెన్స్​కు హాజరయ్యారు. ఈ సమావేశంలో వృద్ధాప్యం, పునర్జన్మలపై ప్రసంగించారు. నలంద సంప్రదాయానికి కుమారుడినని పునరుద్ఘాటించారు.

60 ఏళ్లుగా ధర్మశాలలోనే...

1959 చైనీయుల టిబెట్​ ఆక్రమణ సమయంలో పారిపోయి భారత్​కు వచ్చారు దలైలామా. అప్పటి నుంచి ధర్మశాలలోనే నివాసముంటున్నారు. దలైలామా వారసుడి ఎంపికలో మత నిబంధనలు, చారిత్రక అంశాలతో పాటు అధికార కమ్యూనిస్టు ప్రభుత్వానికి లోబడి ఉండాలని చైనా చెబుతూ వస్తోంది.

త్వరగా కోలుకోవాలి: నవీన్ పట్నాయక్

"ఒడిశా ప్రజల తరఫున దలైలామా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రపంచానికి దలైలామా సేవలు ఎంతో అవసరం."
-నవీన్​ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: చైనా వసంతానికి-మంచు వెన్నెల స్వాగతం

Last Updated : Apr 10, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details