దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రేటు చాలావరకు తగ్గిందని ప్రకటించింది ఆరోగ్య శాఖ. మార్చిలో వైరస్ కేసుల పెరుగుదల శాతం 31గా ఉండగా ప్రస్తుతం అది 3.24కి తగ్గినట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మెరుగైన విధానాలనే పాటిస్తున్నామని తెలిపింది ఆరోగ్య శాఖ.
"మార్చిలో రోజువారీ కేసుల రేటు31.28గా ఉండేది. మే నెలలో అది4.82గా ఉండేది. అయితే జులైననాటికి 3.24 శాతానికి పడిపోయింది."
-ఆరోగ్య శాఖ ప్రకటన
భారత్‌లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో విధాన నిర్ణేతలు ఎక్కువగా గణాంకాల పైనే ఆధారపడతారని చెప్పింది ప్రభుత్వం.
'మానవులపై పరీక్షలు ప్రారంభం'
వ్యాక్సిన్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. 1000మందికి పైగా వాలంటీర్లు రెండు దేశాలకు చెందిన సంస్థల వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ముందుకు వచ్చారు. త్వరితగతిన వ్యాక్సిన్ తీసుకురావాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పేర్కొంది భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్).
భారత్ బయోటెక్, జైడస్ కాడిలా హెల్త్‌కేర్ సంస్థలు మానవులపై ప్రయోగించేందుకు అనుమతులు పొందాయి. ఈ నేపథ్యంలో మానవులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించడం ప్రారంభించాయి ఈ రెండు సంస్థలు.
ఇదీ చూడండి:కరోనాను జయించిన శతాధిక వృద్ధుడికి పుట్టినరోజు వేడుక