తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 గంటల్లో తీరం దాటనున్న 'వాయు' తుపాను - సహాయక చర్యలు

'వాయు'గుండం రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా గుజరాత్​, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్​, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపానును ఎదుర్కోడానికి కేంద్ర హోంశాఖ ముందుస్తు సహాయక చర్యలను చేపడుతోంది.

తీవ్ర తుపానుగా మారనున్న 'వాయు'గుండం

By

Published : Jun 12, 2019, 5:17 AM IST

Updated : Jun 12, 2019, 7:59 AM IST

తీవ్ర తుపానుగా మారనున్న 'వాయు'గుండం

లక్షద్వీప్​కు సమీపంలో నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన 'వాయు'గుండం... రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదిలి గుజరాత్​ వైపు ప్రయాణించనుంది. ముఖ్యంగా సౌరాష్ట్ర, కచ్​ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

అతిభారీ వర్షాలు కురుస్తాయి..

తీవ్ర తుపానుతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారి గుజరాత్​లోని పోర్​బందర్​-మహువా మధ్య తీరందాటుతుందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ 'వాయు' తుపాను ప్రభావం ముంబయిపైనా ఉండనున్న నేపథ్యంలో ఇప్పటికే తీరప్రాంతవాసులకు, మత్స్యకారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

సహాయక చర్యలు..

ముందస్తు సహాయక చర్యల కోసం ఇప్పటికే 26 జాతీయ విపత్తు స్పందన దళాలను గుజరాత్​కు పంపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో మరో 10 బృందాలను పంపించాలని జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్​ఎఫ్)నిర్ణయించింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ముందు జాగ్రత్తగా కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ఇదీ చూడండి: ప్రధాని కార్యదర్శులుగా పాత అధికారులే

Last Updated : Jun 12, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details