జ్యోతి రొంగల... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించిన జ్యోతి... యావత్ దేశాన్ని సైకిల్‌పై చుట్టేయాలని నిర్ణయించుకుంది. ఎవరి సాయం లేకుండా డబ్బు వినియోగించకుండా ఈ యాత్ర చేపట్టింది. ఇప్పటికే 16 వేల కి.మీ యాత్ర పూర్తిచేసింది. తాజాగా నాగాలాండ్‌లోని దిమాపుర్కు చేరుకుంది.
ఎందుకు..?
ఇప్పటివరకు సుదూర సైకిల్ యాత్ర రికార్డ్ 18,999 కి.మీ ప్రయాణించిన ఆస్ట్రేలియావాసి పేరిట ఉంది. ఈ రికార్డ్‌పై కన్నేసింది జ్యోతి. మొత్తం 30 వేల కి.మీ ప్రయాణించేందుకు ప్రణాళిక వేసుకుంది.
"నేను సైకిల్‌పై అన్ని రాష్ట్రాల్లోనూ తిరుగుతూ దేశవ్యాప్తంగా యాత్ర చేయాలనుకుంటున్నాను. డబ్బు లేకుండా ఒంటరిగా తిరుగుతున్నాను. 30 వేల కి.మీ తిరగడమే నా లక్ష్యం. ఇప్పటికే 19 రాష్ట్రాలు పూర్తి చేశాను. గిన్నిస్ రికార్డ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ యాత్ర ద్వారా భారత్‌లోని రోడ్లు మహిళలకు సురక్షితమనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను."
- జ్యోతి రొంగల, సైకిల్ యాత్రికురాలు