తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వకీలుకు ఫేస్​బుక్​లో వలపు వల- రూ.16 లక్షలు టోకరా - జమ్​షద్​పూర్​ న్యాయవాదికి టోకరా 16లక్షలు

ఝార్ఖండ్​​లో తాజాగా ఓ సైబర్​ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్​బుక్​లో యువతి ఫొటోను ప్రొఫైల్​ పిక్​గా పెట్టుకొని న్యాయవాదికి టోకరా వేశాడు ఓ కేటుగాడు. అతడి దగ్గర నుంచి ఏకంగా రూ.16 లక్షలు గుంజేశాడు.

cyber crime
వకీలుకు ఫేస్​బుక్​లో వలపు వల- రూ.16 లక్షలు టోకరా

By

Published : Dec 11, 2019, 1:32 PM IST

ఝార్ఖండ్​లో ఓ న్యాయవాదినే బురిడీ కొట్టించాడు సైబర్​ నేరగాడు. ఫేస్​బుక్​లో యువతి పేరిట ప్రొఫైల్​ క్రియేట్​ చేసి, రూ.16 లక్షలు కాజేశాడు.

ఇదీ జరిగింది

జం​షెద్​పుర్​కు చెందిన ఓ యువ న్యాయవాది పెళ్లి చేసుకోదలచి తన ఫొటో, ఇతర వివరాల్ని ఓ మాట్రిమోని వెబ్​సైట్​లో​ అప్​లోడ్​ చేశాడు. ఆ సమాచారం చూసిన ఓ సైబర్​ నేరగాడు... న్యాయవాదికి ఎర వేశాడు.

ఫేస్​బుక్​లో ఓ నకిలీ ఖాతా సృష్టించి, గుర్తు తెలియని అందమైన యువతి ఫొటోను ప్రొఫైల్​ పిక్​గా పెట్టాడు ఆ కేటుగాడు. మెల్లమెల్లగా న్యాయవాదితో చాటింగ్​ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి దింపాడు. తనని పెళ్లిచేసుకుంటానని నమ్మబలికాడు.

ఫొటోకు రూ. 10 వేలు

న్యాయవాదిని పూర్తిగా నమ్మించానని అనుకున్నాక డబ్బులు రాబట్టే పని మొదలు పెట్టాడు ఆ కేటుగాడు. ఏదో అత్యవసరం ఉందని అడిగి తొలుత రూ.10 వేలు తీసుకున్నాడు. తర్వాత న్యాయవాది ఫొటో పంపమని అడగగా మరో రూ.10 వేలు రాబట్టాడు. ఇలా విడతల వారీగా రూ.16 లక్షలు కాజేశాడు.

న్యాయవాది కలుద్దామన్న ప్రతిసారీ ఏదో వంక చెప్పి తప్పించుకునేవాడు. చివరకు ఓ సారి తప్పనిసరిగా కలవాలని తెగేసి చెప్పగా... ఫేస్​బుక్​ ఖాతాను డీయాక్టివేట్​ చేసేశాడు.
మోసపోయానని గ్రహించిన న్యాయవాది... పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి : బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టబోయిన జగన్​

ABOUT THE AUTHOR

...view details