తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ భేటీ నేడు - rahul gandhi news

కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం శనివారం జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేత ఒకరు చెప్పారు. మొదట ఈ భేటీని సోమవారం లేదా ఆ తర్వాత నిర్వహించాలని భావించినట్లు పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

cwc meeting tobe held through video confernce
వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ భేటీ నేడు!

By

Published : Aug 22, 2020, 7:37 AM IST

పార్టీలో అంతర్గత కలహాలకు నాయకత్వ అంశమే కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ)ని సమావేశ పరచాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే ఈ భేటీ సోమవారం లేదా తర్వాత ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని ప్రయోగాత్మకంగా బహుశా శనివారమే చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

' ఏ క్షణంలోనైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్​ చేపట్టే అవకాశం ఉంది. దీంతో తమ రాజకీయ భవిత గురించి సోనియా విధేయులైన కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే మరో ఏడాది పాటు కొనసాగాలని వారు కోరుకుంటున్నారు.' అని కాంగ్రెస్​ అంతర్గత వ్యవహారాలు తెలిసిన ఓ నేత పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'భారత్ ప్రతిఘటనను చైనా ఊహించలేకపోయింది'

ABOUT THE AUTHOR

...view details