- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ
- సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటన
- సీడబ్ల్యూసీ సమావేశంలో ఎంపిక చేసిన నేతలు
- పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో సోనియాగాంధీ
లైవ్: కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు సోనియా గాంధీ - పార్టీ అధ్యక్షుడు
23:13 August 10
'మా పార్టీ అధ్యక్షురాలు సోనియా'
22:59 August 10
కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు సోనియా గాంధీ
దిల్లీలో నిర్వహించిన ఏఐసీసీ సమావేశం ముగిసింది. సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్టు పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించారు.
22:37 August 10
'కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికను ప్రస్తుతం పక్కనపెట్టాం'
కశ్మీర్ అంశాన్ని చర్చించడానికే తాను ప్రత్యేకంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టాం
- జమ్ము-కశ్మీర్ అంశంపైనే ప్రధానంగా చర్చించాం
- జమ్ము-కశ్మీర్‌పై తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి
- జమ్ము-కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రధాని ప్రజలకు జవాబు చెప్పాలి
- జమ్ము-కశ్మీర్ పరిస్థితులపై చర్చించేందుకే నన్ను పిలిచారు
- కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై సీడబ్ల్యూసీ చర్చిస్తుంది
22:06 August 10
'రాహుల్ మళ్లీ పగ్గాలు చేపట్టాలి'
- రాహులే మళ్లీ పగ్గాలు చేపట్టాలంటున్న ఏఐసీసీ సభ్యులు
- అధ్యక్షుడిగా రాహులే ఉండాలని కోరుతున్న ఎక్కువమంది సభ్యులు
21:36 August 10
సమావేశానికి రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ కార్యానిర్వాహక కమిటీ సమావేశం ప్రారంభమయ్యాక ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.
20:54 August 10
సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం
సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం
- అధ్యక్షుడి ఎంపికపై కమిటీల నివేదిక తీసుకోనున్న సీడబ్ల్యూసీ
- అన్ని రాష్ట్రాల అభిప్రాయాలతో నివేదికలు సిద్ధం చేసిన 5 కమిటీలు
- కమిటీల నివేదిక ఆధారంగా అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం
- ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు
- భేటీకి హాజరైన సోనియా, ప్రియాంక, మన్మోహన్‌సింగ్
- భేటీకి హాజరైన ఆజాద్, ఆంటొనీ, చిదంబరం, అంబికా సోని, సభ్యులు
20:35 August 10
సోనియా.. ప్రియాంక
సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
20:20 August 10
సమావేశానికి తరలి వస్తున్న అగ్రనేతలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, సింధియ తదితరలు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సమావేశం ప్రారంభంకానుంది.
19:26 August 10
ఇప్పుడైనా తేలేనా?
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా సమర్పించి చాలా కాలం గడుస్తున్నా... నూతన సారథిపై ఇంకా ఎటూ తేల్చలేదు కాంగ్రెస్. ఈ రోజు ఉదయం సుదీర్ఘంగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయంపై ఓ నిర్ణయం వస్తుందని అంతా ఊహించారు. అయితే ఈ భేటీలో స్పష్టత రాలేదు. రాత్రి 8.30 గంటలకు సీడబ్ల్యూసీ మరోమారు సమావేశం కానుంది. కొత్త అధ్యక్షుడిపై నేడు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరోసారి విజ్ఞప్తి...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ మరోసారి చేసిన విజ్ఞప్తిని రాహుల్ గాంధీ తోసిపుచ్చినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. రాజ్యాంగ సంస్థలపై ప్రభుత్వం దాడి చేస్తున్న ఈ తరుణంలో రాహుల్ నాయకత్వం కావాలని సీడబ్ల్యూసీ కోరగా.. రాహుల్ తిరస్కరించారట. శ్రేణులతో కలిసి పోరాటం చేయడానికి రాహుల్ సుముఖత చూపినట్లు సుర్జేవాలా తెలిపారు.
రాహుల్ రాజీనామా సీడబ్ల్యూసీ పరిశీలనలోనే ఉందని సుర్జేవాలా స్పష్టం చేశారు. ఈ విషయంపై సాయంత్రానికి సీడబ్ల్యూసీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
5 బృందాలు ఏర్పాటు...
కాంగ్రెస్ అధ్యక్షుణ్ని ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సీడబ్ల్యూసీ సభ్యులతో ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. రాహుల్‌గాంధీ వారసుణ్ని ఎంపిక చేసేందుకు ఇవాళ దిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన సీడబ్ల్యూసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ అనుబంధాన సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తీసుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు.
రేసులో...
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే పేర్లు ఉన్నట్లు సమాచారం. యువనేతల్లో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్ పేర్లు వినిపిస్తున్నాయి.
19:14 August 10
మరికాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశం..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరికాసేపట్లో రెండోసారి సమావేశం కానుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం ఒకసారి సమావేశమైన సీడబ్ల్యూసీ....కొత్త అధ్యక్షుడిపై దేశవ్యాప్తంగా పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు వర్కింగ్ కమిటీ సభ్యులతోనే అయిదు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలను ఈశాన్య, తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ భారతంగా విభజించారు. రాహుల్ వారసుడి పేరుపై ఈ బృందాలు సేకరించిన అభిప్రాయంపై తాజాగా జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు.