తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందే భారత్ మిషన్​లో.. బంగారం స్మగ్లింగ్​!

రాజస్థాన్ జైపుర్​ విమానాశ్రయంలో... బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Customs department caught 32 kg gold at Jaipur Airport
వందే భారత్ మిషనలో.. బంగారం స్మగ్లింగ్​

By

Published : Jul 4, 2020, 9:48 AM IST

Updated : Jul 4, 2020, 11:16 AM IST

దుబాయ్​ నుంచి జైపుర్​కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

"14 మంది స్మగ్లర్లు దుబాయ్ నుంచి జైపుర్​కు మూడు విమానాల్లో వచ్చారు. వారందరూ కలిసి సుమారు రూ.16 కోట్లు విలువైన 32 కేజీల బంగారాన్ని అక్రమంగా భారత్​కు తరలించాలని చూశారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి దర్యాప్తు జరుగుతోంది."

- కస్టమ్స్ అధికారులు

వందే భారత్ మిషన్​లో

కరోనా సంక్షోభ కాలంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ వలసదారులను తిరిగి స్వదేశానికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లోని రాజస్థాన్ వలసదారులను తిరిగి జైపుర్​కు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టింది. అయితే కొందరు స్మగ్లర్లు ఇదే అదనుగా తమ చేతివాటం ప్రదర్శించారు. దుబాయ్ నుంచి జైపుర్​కు వచ్చిన విమానంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించి... కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

స్మగ్లర్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు

ఇదీ చూడండి:భారత్​ అసాధారణ నిర్ణయంతో టిక్​టాక్​కు భారీ దెబ్బ

Last Updated : Jul 4, 2020, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details